Image | Name | Description | Price | Quantity | Add to cart |
| | పదవశతాబ్దము నందు కాశ్మీర్ లో నివసించిన శ్రీ అభినవగుప్తుల వారు, కాశ్మీరశైవమని పిలువబడుతున్న శివాద్వైతము లేదా త్రికసిద్ధాంతము నందు మహా పండితులే గాక, పరమశివానుభవమును పొందిన మహా తపశ్శాలి, తంత్రసిద్ధుడూ అయి ఉన్నారు. స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే విభాగములతో విరాజిల్లుతున్న త్రికశాస్త్రమును ఔపోసన పట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి రచించిన అనేక గ్రంథములలో, శైవాగమముల సారమని చెప్పదగిన తంత్రాలోకము సుప్రసిద్ధమైనది. అనేక వేల శ్లోకములతో బహువిస్తారముగా ఉన్న ఈ గ్రంథమును అల్పబుద్ధులు గ్రహించలేకపోతున్నందు వలన, దానిని కుదించి, సులభవచనంలో ‘తంత్రసారము’ అనే గ్రంథమును ఆయన రచించారు. ఈ సంస్కృతగ్రంథమును జిజ్ఞాసువుల ఉపయోగార్థమై తెలుగుభాషలోకి తేగలగడం పరమేశ్వర కటాక్షంగా భావిస్తున్నాము.
Purchase eBook on
| | | |
| | అపౌరుషేయములైన వేదమంత్రములకు, మహావాక్యములకు, ప్రస్థానత్రయమునకు అద్వైతసిద్ధాంతరీత్యా వ్యాఖ్యానమును గావించి, అద్వైతమును పరమతార్కికమతముగా లోకమున ప్రతిష్ఠించిన ఘనత ఆదిశంకరాచార్యులవారికి చెందుతుంది. వీరి గ్రంథములలో ఆత్మబోధ చాలా చిన్నది. కానీ భావగాంభీర్యములో చాలా లోతైనది. కేవలము 68 శ్లోకములలో, అద్వైతవేదాంత సిద్ధాంతమును ప్రతిపాదించడమే గాక, నిత్యజీవితములో మనకు ఎదురయ్యే అనేక సులభమైన ఉదాహరణల సహాయంతో దాని లోతుపాతులను వివరించిన ఘనత ఆచార్యులవారి పాండిత్యానికి, జ్ఞానపరాకాష్ఠకు నిదర్శనమై యున్నది.
ఈ గ్రంథమునకు ఎందరో పండితులు, మహనీయులు వ్యాఖ్యానములు వ్రాసినారు. నా అవగాహనరీత్యా నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను. ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి వస్తున్న మొదటి అద్వైతవేదాంత గ్రంథమిది.
జ్ఞానమార్గావలంబులైన చదువరులకు ఈ గ్రంథము మిక్కిలి ఉపలబ్దంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
Purchase eBook on
| | | |
| | ఆదిశంకరులచే రచింపబడి మనకు లభిస్తున్న గ్రంథములలో మణిపూస వంటిది ఈ అపరోక్షానుభూతి. జ్ఞానమార్గసాధన ఈ గ్రంథములో మెట్టుమెట్టుగా వివరింపబడినది. సాధనామార్గమున కావలసిన అర్హతలైన సాధనాసంపత్తిని వివరించిన తర్వాత, ఆత్మ యన్నది దేహం కాదని అనేక ఉదాహరణల ద్వారా చెప్పి, ఆపైన, దేహం కూడా ఆత్మలో భాగమేనని ఆచార్యులవారు వివరించారు. ఉన్నది ఆత్మయేనని, దేహమనిన భావన ఒక భ్రమమాత్రమేనని, ఆ ఆత్మ కూడా బ్రహ్మమే దప్ప వేరొకటి కాదనిన బోధనలు ఈ గ్రంథంలో లభిస్తున్నాయి. చివరిగా, ఈ బ్రహ్మనుభూతిని అందుకునే క్రమంలో, పదిహేను మెట్లతో కూడిన యోగ, జ్ఞానమార్గముల మిశ్రమం సాధనాపరంగా ఉపదేశింపబడింది. అద్వైతాభిమానులకు మా వ్యాఖ్యానం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.
Purchase eBook on
 | | | |
| | ‘దృగ్ - దృశ్య వివేకము’ అనబడే ఈ చిన్ని గ్రంథము, కేవలం 46 శ్లోకముల సమాహారం. కానీ దీనిలో చెప్పబడిన వేదాంతతత్త్వపు లోతులు అగాధములైనవి. చిన్నిమాటలలో పెద్దభావమును ఇమిడ్చి బోధించడం మహనీయుల మార్గం.
అద్వైతసాంప్రదాయమును శంకరాద్వైతులైన మహనీయులెందరో వారి రచనలతో బోధలతో పరిపుష్టం గావించారు. అట్టివారిలో శృంగేరీ పీఠమును క్రీ. శ 1328 నుండి 1380 వరకూ అధిరోహించిన జగద్గురు శ్రీ భారతీతీర్థులవారు ఈ గ్రంథమును రచించినట్లు తెలియవస్తున్నది. ఈ మహత్తరగ్రంథమునకు మా వ్యాఖ్యానము జిజ్ఞాసువులను రంజింపజేస్తుందని భావిస్తున్నాము.
Purchase eBook on
 | | | |
| | It is well known that Goddess Kali of Dakshineswar temple where Sri Ramakrishna lived is known as Bhavatarini or emancipator of worldly bondage.
This poetic hymn was composed extempore by the author in 2013 in 27 Sanskrit slokas, followed by 260 Telugu poems. Though it is a devotional hymn addressed to Goddess Kali in her form of Bhavatarini or Tara, each of its verses contains many esoteric secrets of Tantra sadhana. We hope that readers will be blessed by going through this sublime work of devotion and poetic beauty.
Purchase eBook on
 | | | |
| | తొలివేద కాలమునకు చెందిన హోమవిధానమును, మలివేద కాలమునకు చెందిన అంతరికఉపాసనతో సమన్వయపరిచే ప్రక్రియ ఈ ఉపనిషత్తులో మనకు గోచరిస్తుంది. ఈ ప్రక్రియను ఆచరించేవారు, హోమములను చేయకపోయినా, సాంఖ్యము, యోగము మొదలైన శాస్త్రములు, సాధనలు, తెలియకపోయినా, మోక్షమును పొందుతారని ఇందులో చెప్పబడింది. సృష్టిని, ప్రకృతిని దైవం యొక్క వెలుగుగా దర్శిస్తూ, మన ప్రాణమునే అగ్నిగా భావించి, నిత్యమూ మనము తీసుకునే ఆహారమును దానిలోకి ఇచ్చే ఆహుతులుగా తలచుకుంటూ చేసే ఉపాసన ఇందులో చెప్పబడింది. ఈ చిన్నిపుస్తకం ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి లభిస్తున్న ఉచిత పుస్తకములలో ఒకటి.
Download free eBook on
 | | | |
| | ఈ ఉపనిషత్తు సామాన్యోపనిషత్తుల కోవకు చెందినది. ముఖ్యములైన దశోపనిషత్తులకు భిన్నములైనప్పటికీ, వాటిలోని భావములను తీసుకుని వివరించే చిన్న ఉపనిషత్తులను సామన్యోపనిషత్తులంటారు.
ఇది కృష్ణ యజుర్వేదమునకు, అథర్వణవేదమునకు అనుబంధమై ఉన్నది. కొన్నిచోట్ల ఈ ఉపనిషత్తు, ‘సర్వసారోపనిషత్తు’ అనీ, ‘సర్వోపనిషత్తు’ అనీ ‘సర్వోపనిషత్సారమ’నీ పిలువబడింది. అంటే, అన్ని ఉపనిషత్తుల సారము ఈ ఉపనిషత్తులో ఉన్నదని అర్థము. వేదముల సారము ఉపనిషత్తులైతే, ఉపనిషత్తుల సారమంతా దీనిలో ఉన్నది. ఈ విధంగా చూచినప్పుడు, దీనియొక్క విశిష్టత అర్థమౌతుంది.
Download free eBook on
 | | | |
| | ‘సవిత’, ‘సావిత్రి’ అనే పదములు ఈ ఉపనిషత్తులో మనకు గోచరిస్తాయి. రెండునూ సూర్యభగవానుని సూచించేవే అయినప్పటికీ, వీటి అర్థములలో భేదమున్నది. సవిత యొక్క శక్తికే సావిత్రి అని పేరు. అంటే సూర్యుని యొక్క తేజస్సని అర్థం. మిట్టమధ్యాహ్నం పూట మండుతున్న సూర్యునకు ‘సవిత’ యని, తీక్షణమైన ఆయన తేజస్సుకు ‘సావిత్రి’ యని పేర్లున్నాయి. గాయత్రీ ఉపాసనలో, ఉదయకాల సూర్యుని వెలుగుకు గాయత్రి యని, మిట్టమధ్యాహ్నపు వెలుగుకు సావిత్రియని, సాయంకాలపు వెలుగుకు సరస్వతియని పేర్లున్నాయి.
గాయత్రీ మంత్రార్థమును విశ్వవ్యాప్తమైన అధ్యాత్మికకోణంలో అవిష్కరించడం ఈ ఉపనిషత్తు యొక్క మహాత్యం. ఆకలిదప్పులను దూరం చేసే ‘బలాతిబల విద్య’ ఈ ఉపనిషత్తుకు అనుబంధంగా చెప్పబడింది.
Download free eBook on
 | | | |
| | We find in this Upanishad an attempt to integrate the fire sacrifice of the old Vedic period with the internal yogic sadhana of the later Vedic period. It says that the seeker who knows this method can attain ultimate freedom even without doing the fire rituals or without knowing the paths like Samkhya and Yoga. It teaches us to see the creation as the manifestation of God and to offer the food we consume as an oblation into the fire of our prana. This book comes as a free E-book from our organisation.
Purchase eBook on
 | | | |
| | ‘ఆత్మోపనిషత్’ అనబడే ఈ ఉపనిషత్తు, సామాన్యోపనిషత్తుల కోవకు చెంది, అథర్వణ వేదములో భాగమై యున్నది. ఉన్న విషయమును సూటిగా చెబుతూ, దేహము, ఆత్మ, పరమాత్మ అనే వాటిని సులభముగా వివరిస్తుంది ఈ ఉపనిషత్తు. ఇది అంగీరసఋషి యొక్క బోధగా గోచరిస్తుంది. అంగీరసఋషి ప్రాచీనులైన సప్తఋషులలో ఒకరు. ఋగ్వేదంలో ఈయన యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. రాశిలో చిన్నదైనా వాసిలో ఘనమైన ఈ ఉపనిషత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాంతత్త్వమంతా సులభంగా అర్థమౌతుంది.
Purchase eBook on
 | | | |