ఆదిశంకరులచే రచింపబడి మనకు లభిస్తున్న గ్రంథములలో మణిపూస వంటిది ఈ అపరోక్షానుభూతి. జ్ఞానమార్గసాధన ఈ గ్రంథములో మెట్టుమెట్టుగా వివరింపబడినది. సాధనామార్గమున కావలసిన అర్హతలైన సాధనాసంపత్తిని వివరించిన తర్వాత, ఆత్మ యన్నది దేహం కాదని అనేక ఉదాహరణల ద్వారా చెప్పి, ఆపైన, దేహం కూడా ఆత్మలో భాగమేనని ఆచార్యులవారు వివరించారు. ఉన్నది ఆత్మయేనని, దేహమనిన భావన ఒక భ్రమమాత్రమేనని, ఆ ఆత్మ కూడా బ్రహ్మమే దప్ప వేరొకటి కాదనిన బోధనలు ఈ గ్రంథంలో లభిస్తున్నాయి. చివరిగా, ఈ బ్రహ్మనుభూతిని అందుకునే క్రమంలో, పదిహేను మెట్లతో కూడిన యోగ, జ్ఞానమార్గముల మిశ్రమం సాధనాపరంగా ఉపదేశింపబడింది. అద్వైతాభిమానులకు మా వ్యాఖ్యానం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.
Aparokshanubhuti