Regular Table

Showing 51 – 60 of 79 results Showing all 79 results Showing the single result No results found
Sort by Price low to high
Filters Sort results
Reset Apply
Image
Name
Description
Price
Quantity
Add to cart
FC_Uttara-Gita

వేదాంతవాఙ్మయములో మనకు లభిస్తున్న గీతలలో శ్రీకృష్ణునిచేత చెప్పబడిన గీతలు మూడున్నాయి. ఇవి, భగవద్గీత, అనుగీత, ఉత్తరగీతలు. భగవద్గీత అందరకూ తెలిసినది, మరియు యోగ-వేదాంతశాస్త్రముల సారమని చెప్పబడుతుంది. అనుగీత యనునది మహాభారతములోని అశ్వమేధపర్వములోనిది, భగవద్గీతకు అనుచరమైనది. ఉత్తరగీత ఏ ప్రధానగ్రంథములోనిదో తెలియడం లేదు. బహుశా, స్వతంత్రమైన రచనయై యుండవచ్చును.

భగవద్గీతలో చెప్పబడిన విషయములను మరచిపోయిన అర్జునుడు, మరలా చెప్పమని శ్రీకృష్ణుని అడుగగా దానికి సంక్షిప్తముగా శ్రీకృష్ణుడిచ్చిన సమాధానమే అనుగీత, ఉత్తరగీతల విషయము. భగవద్గీతలో, కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞాన, యోగశాస్త్రములు విస్తారముగా వివరింపబడినప్పటికీ, ఉత్తరగీతలో మాత్రం ఒక్క యోగసాధనా విధానము మాత్రమే ప్రముఖముగా కనిపిస్తున్నది. కనుక యోగాభ్యాసపరులకు ఈ గ్రంథము విందుభోజనం వంటిది. ఇది మా సంస్థనుండి వెలువడుతున్న 56 వ గ్రంథము.

Purchase eBook on
Get it on Google Play

 70
Max: 11
Min: 1
Step: 1
Yogabeejam

హిందూమతమని పిలువబడే సనాతనధర్మంలో నాథసంప్రదాయం ఒకటి. దీనినే సిద్ధసంప్రదాయమని కూడా పిలుస్తారు. దీనిలో నవనాథులనబడే సిద్దులు ప్రసిద్దులు. ఆదినాధుడైన ఈశ్వరుని నుండి ఈ సాంప్రదాయం మొదలైనవి. ఆయన నుండి మత్స్యేంద్రనాథుడనే మహాసిద్ధుడు వచ్చినాడు. ఆ తరువాత ఆయన శిష్యుడైన గోరఖ్ నాథుడు దర్శనమిస్తాడు. ఈయన కూడా తన గురువువలె మహాసిద్దుడు.

శ్రీ గోరక్షనాథులు రచించిన ఈ గ్రంథమునకు చేయబడిన మా వ్యాఖ్యానము యోగసాధకులకు, సిద్ధమార్గమును అభిమానించేవారికి ఆనందము కలిగిస్తుందని ఆశిస్తున్నాము.

Purchase eBook on
Get it on Google Play

 70 100
Max: 10
Min: 1
Step: 1

ఆదినాథుడైన పరమశివుని నుండి ఉద్భవించినవే నాథ సాంప్రదాయము. దీనియందు నవనాథులు ప్రసిద్ధులు. వీరు వరుసగా మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు మొదలుగా గల తొమ్మిది మంది మహాసిద్ధులుగా ఉన్నారు. వీరి యోగము పతంజలిమహర్షి ప్రణీతమైన అష్టాంగయోగమునకు భిన్నమైన షష్టాంగయోగమని చెప్పబడుతుంది.

సిద్ధయోగసాధనా విధానములను వివరిస్తున్న ఈ అద్భుత గ్రంథమునకు నా వ్యాఖ్యానము యోగాభిమానులకు, సిద్ధయోగ సాధకులకు, సమస్త భారతీయులకు ఆనందమును కలిగిస్తుందని భావిస్తున్నాను.

Purchase eBook on
Get it on Google Play

 70
Max: 92
Min: 1
Step: 1
TN_Maha_Souram

సూర్యోపాసకులు జపించే మంత్రాలలో 'మహాసౌరమ్' మొదటిస్థానంలో ఉంటుంది. రెండవది 'అరుణమ్'. మూడవది 'ఆదిత్యహృదయం'. మొదటి రెండూ వేదంలోనివి. మూడవది రామాయణం లోనిది.

'మహాసౌరమ్' అనేది ఋగ్వేదంలో ఉన్న 65 మహా ప్రభావవంతములైన సూర్యమంత్రముల సమాహారం. వీటిని పదముగ్గురు వేదఋషులు తమ తపస్సాధనలో దర్శించారు. వారి దర్శనములు ఋక్కులుగా వెలువడ్డాయి. ఈ ఋక్కులు (మంత్రములు) వేదంలో ఒకేచోట లేవు. చెదురుమదురుగా ఉన్నాయి. ఆ విధంగా ఋగ్వేదంలో ఉన్న 16 చోట్ల నుండి సేకరింపబడిన ఈ మంత్రములు 'మహాసౌర మంత్రపాఠమ్', 'మహాసౌరమ్' అనే పేర్లతో వేలాది ఏండ్లనుండి మన దేశంలోని సూర్యోపాసకులచేత జపింపబడుతున్నాయి.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 120 150
Max: 5
Min: 1
Step: 1

బుద్ధుని ధ్యానమార్గమైన 'విపశ్యాన ధ్యానము' నకు ఇది ఒక గైడ్ బుక్ వంటిది. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అర్ధం చేసుకుంటే, బుద్ధుని ధ్యానమార్గం చక్కగా అర్ధమౌతుంది. ఆయన చేసిన సాధన ఏమిటో, ఆయన నడచిన దారి ఏమిటో, దానిలో మనం కూడా ఎలా నడవవచ్చో స్పష్టంగా అర్ధమౌతుంది.

మా ఇతర ప్రచురణల వలెనే, ఈ పుస్తకం కూడా మీ ఆదరణను పొందుతుందని, మీకు ఆధ్యాత్మికంగా గొప్ప మార్గదర్శి అవుతుందన్న విశ్వాసం మాకుంది.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 120
Max: 5
Min: 1
Step: 1
TN_Yoga_Shikopanishath

యోగోపనిషత్తులలో ఇది అగ్రగణ్యమైనది. అందుకే దీనికి 'యోగశిఖ' అనే పేరు వచ్చింది. భగవద్గీతకూ దీనికీ పోలికలున్నాయి. భగవద్గీత ఎలాగైతే తన పద్దెనిమిది అధ్యాయములలో పద్దెనిమిది విభిన్నములైన సాధనామార్గములను వివరించిందో, అదే విధంగా, ఈ గ్రంధంకూడా తన ఆరు అధ్యాయములలో ఆరు సాధనామార్గములను చెప్పింది. సిద్ధయోగమునకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిన ఈ గ్రంధం, కుండలినీయోగమును, అద్వైతసాంప్రదాయమును, యోగసాధనలోని అనేక అంశములను ఒకేచోట వివరించే ప్రయత్నాన్ని చేసింది. అందుకనే ఈ గ్రంధం యోగశాస్త్రములలో తలమానికమని పండితుల అభిప్రాయం.

ఈ గ్రంధం ఇప్పటిది కాదు. రెండువేల ఏళ్ళ క్రితం వ్రాయబడిన గ్రంథమిది. దీనికి నేను వ్యాఖ్యానం వ్రాయగలగడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, నా గురుదేవుల అనుగ్రహం.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 120 150
Max: 4
Min: 1
Step: 1
TN_Varahopanishat

దీనిలో 5 అధ్యాయములు, 247 శ్లోకములున్నాయి. బ్రహ్మమానసపుత్రుడైన ఋభుమహర్షి చేసిన తపస్సు గురించి, ఆయన పొందిన బ్రహ్మజ్ఞానమును గురించి, పులస్త్యబ్రహ్మ కుమారుడైన నిదాఘునికి ఆయన గురువై జ్ఞానబోధ చేసిన వృత్తాంతమంతా ఈ ఉపనిషత్తులో ఉన్నది గనుక ఇది అతి ప్రాచీనమైనదే గాని, బాగా తరువాతి కాలంలో గ్రంథస్థం చేయబడినదని అర్థమౌతున్నది. దీనిలోని అనేక విషయములు దాదాపు రెండువేల సంవత్సరముల నాటివి. కానీ ఇది వ్రాయబడినది మాత్రం దాదాపుగా 13 శతాబ్దం ప్రాంతమని పండితుల అభిప్రాయం.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 120 150
Max: 6
Min: 1
Step: 1
Siddha Siddhanta Paddhati_FC

మానవజీవితానికి పరిపూర్ణత ఎలా వస్తుంది? దానికి ఏమేం చెయ్యాలి? అనేది మాత్రమే గాక, సృష్టి ఏ విధమైన ప్రణాళికతో జరిగింది అనే విషయాన్ని బ్రహ్మాండం నుండి పిండాండం వరకూ కూలంకషంగా వివరించడం జరిగింది.
Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 120 150
Max: 8
Min: 1
Step: 1

విజ్ఞాన భైరవ తంత్రమన్నది భైరవాగమము నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞానతంత్రము. అనగా, భౌతికములైన తంతులతో సంబంధము లేని ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి. నూట పన్నెండు పైగా ధారణా విభాగములు దీనిలో ఉన్నవి. నేడు ప్రపంచమంతటా గురువులు భోధించుచున్నవి, ఉపాసకులు చేయుచున్నవి అయిన సాధనలన్నియు ఈ తంత్రమున లభిస్తాయి.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 120 150
Max: 10
Min: 1
Step: 1
Siva Svarodaya Shastramu Front Image

స్వరశాస్త్రమనే ఈ ప్రాచీనగ్రంథము తంత్రశాస్త్రమునకు చెందినది. తంత్రములన్నియు పరమశివుని చేత దేవికి చెప్పబడినవి. ఈ గ్రంథములో స్వరములు వాటి తత్త్వములు, దశనాడులు, దశవాయువులు, నిత్యజీవితంలో ఈ శాస్త్రము యొక్క ఉపయోగము, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి వివిధ ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దినఫలితములు, వాతావరణ పరిశీలన, పంటలు, స్త్రీ వశీకరణము, సంతానము, రోగములు నిర్ధారణ, మరణసమయము, ఛాయాపురుష సాధన, కుండలినీ యోగము మొదలైన అనేక విషయములు వివరింపబడినవి.

‘పంచవటి’ నుండి వెలువడుచున్న 61వ గ్రంథముగా దీనిని విడుదల చేయుచున్నాము.

Purchase eBook on
Get it on Google Play

 120 150
Max: 4
Min: 1
Step: 1
1...5678