Image | Name | Description | Price | Quantity | Add to cart |
|---|---|---|---|---|---|
| 16-17 శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీపరమశివేంద్రసరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు 58 వ ఆచార్యునిగా ఉన్నారు. సదాశివయోగీంద్రుల గురించిన అనేక మహిమలు మరియు గాథలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను ఈయన రచించారు. వాటిలోని ఒకటి భక్తి, మంత్ర, లయ, హఠ, రాజ, జ్ఞానయోగముల మేలు కలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో సాధనల సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము. | ₹ 120₹ 125 | Max: 6 Min: 1 Step: 1 | |||
| 16-17 శతాబ్దములలో తమిళనాడులో నివసించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీ స్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, కంచి కామకోటిపీఠమునకు 58 వ ఆచార్యులైన శ్రీపరమశివేంద్రసరస్వతీస్వామి యొక్క శిష్యుడు. అనేక మహిమలు మరియు గాధలు ఈయన పేరుమీద దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను ఈయన రచించారు. ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి. పంచవటి నుండి వెలువడుతున్న 72 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము. | ₹ 120 | Max: 8 Min: 1 Step: 1 | |||
| మొత్తం 504 శ్లోకములలో ప్రాచీన యోగశాస్త్రమును వివరించిన ఈ గ్రంథం దాదాపుగా రెండువేల సంవత్సరముల క్రిందటిది. ప్రాచీనమైన ఈ గ్రంథంలో వైదిక సాంప్రదాయానుసారమైన యోగమార్గం వివరింపబడి గోచరిస్తున్నది. వేదకాలపు మహర్షియైన యాజ్ఞవల్క్యఋషి తన సతీమణియైన బ్రహ్మవాదిని గార్గికి చేసిన బోధగా ఈ గ్రంథం చెప్పబడింది. | ₹ 130 | Max: 11 Min: 1 Step: 1 | |||
| ₹ 130₹ 150 | Max: 7 Min: 1 Step: 1 | ||||
| దేవీభాగవతము ఏడవభాగములోని చివరి పది అధ్యాయములు 'దేవీగీత' అనే పేరుతో ప్రసిద్ధిగాంచినవి. దీనిలో సాక్షాత్తు జగదంబయే చెప్పినట్లుగా జ్ఞాన, భక్తి, యోగ, తంత్రముల సమన్వయపూర్వకమైన బాహ్య - అంతరిక ఉపాసనావిధానము మనకు గోచరిస్తుంది. తానే పరబ్రహ్మమునని, త్రిమూర్తులకు కూడా తానే మూలమునని, అనేక రూపములలో, విధానములలో, సృష్టి మొత్తము ఆరాధిస్తున్నది తననే యని జగదంబ చెప్పినట్లుగా దీనిలో మనము చూడవచ్చు. | ₹ 130 | Max: 6 Min: 1 Step: 1 | |||
| ₹ 150₹ 200 | Max: 4 Min: 1 Step: 1 | ||||
| జ్యోతిష్యశాస్త్రంలోని ఒక అనుబంధ విభాగంగా భారతీయ సంఖ్యాశాస్త్రం ఉంటుంది. అంకెలకు గ్రహాలకు అవినావభావ సంబంధం ఉన్నది. ఈ పుస్తకంలో ఇవ్వబడిన సనాతన భారతీయ సంఖ్యాశాస్త్రవిధానం ప్రకారం మీ జాతకాన్ని చూచుకోండి. అప్పుడు మీ జీవితమూ, దాని నడకా, దాని తీరుతెన్నులు, మొత్తం మీకర్థమౌతుంది. ఈ విధానం ఎంత సులభమైనదో, సరియైనదో అప్పుడు మీకర్థమౌతుంది. ఇది నా పరిశోధన ద్వారా వెలుగుచూచిన విధానం. నా 61వ పుట్టినరోజు సందర్భంగా దీనిని అక్షరబద్ధం చేసి మా 67వ పుస్తకంగా విడుదల చేస్తున్నాను. | ₹ 150₹ 200 | Max: 9 Min: 1 Step: 1 | |||
| తొలి వేదకాలములో పరబ్రహ్మమునకు ఇవ్వబడిన ప్రాధాన్యత మలివేదకాలమునకు వచ్చేసరికి శక్తిప్రాధాన్యతగా మారింది. సామూహికములగు యజ్ఞయాగములనుండి, మంత్ర-యంత్ర-తంత్రసహితమైన వ్యక్తిగత అంతరికసాధనకు ప్రాముఖ్యత పెరిగింది. దీనిననుసరిస్తూ అనేక శాక్తోపనిషత్తులు రచింపబడినాయి. వాటిలో ముఖ్యములైన పది ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును మా సంస్థయొక్క 73వ గ్రంథంగా వెలువరుస్తున్నాము. దీనిలో అనేక తంత్రసాధనా రహస్యములు వివరించబడినాయి. | ₹ 150₹ 200 | Max: 6 Min: 1 Step: 1 | |||
| ₹ 200₹ 220 | Max: 6 Min: 1 Step: 1 | ||||
| స్వరచింతామణి యనే ఈ ప్రాచీనగ్రంథము పేరుకు తగినట్లు, చింతలను తీర్చే మణి వంటిది. దీని రచయిత శ్వేతకేతు యోగి. ఇది కూడను తంత్రశాస్త్ర విభాగమే. ఈ గ్రంథములో పిండోత్పత్తి, స్వరోత్పతి, కాలప్రమాణములు, నాడీసంధి, అజపాలక్షణము, స్వరకర్మ, వార, పక్ష, మాస, సంవత్సర స్వరములు, మూలస్వర విజ్ఞానము, నిత్యజీవితములో ఈ శాస్త్రము యొక్క వివిధములైన ఉపయోగములు, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దిన ఫలితములు, యుద్ధము, జూదము, ఉత్తమ స్త్రీ పురుష లక్షణములు, స్వప్నజ్ఞానము, వశీకరణము, సంతానము, రోగముల నిర్ధారణ, మరణసమయము, శకునములు, సాముద్రికజ్ఞానము మొదలైన అనేక విషయములు వివరించబడినది. ‘పంచవటి’ నుండి వెలువడుచున్న 62వ గ్రంథముగా దీనిని విడుదల చేయుచున్నాము. | ₹ 200 | Max: 13 Min: 1 Step: 1 |











