ఇందులో హంసోపనిషత్, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్ అనబడే ఆరు యోగోపనిషత్తులకు నా వ్యాఖ్యానమును మీరు చదువవచ్చు. వీటిలో హంసోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్తులు శుక్లయజుర్వేదమునకు చెందినవి కాగా, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్తులు కృష్ణయజుర్వేదమునకు చెందినవి.
యధావిధిగా వీటన్నిటిలో అనేక రకములైన వైదికసాంప్రదాయబద్ధమైన యోగసాధనావిధానములు చెప్పబడినవి. మంత్ర, లయ, హఠ, రాజయోగములు, సృష్టిక్రమము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తస్థితి మొదలైన సంగతులు వివరించబడినవి.