దత్తాత్రేయులవారు త్రిమూర్తి స్వరూపుడని మన నమ్మకము. ఈయన మహాజ్ఞాని మాత్రమేగాక మహాయోగి కూడా ! అవధూత సాంప్రదాయమునకు ఈయన ఆద్యుడు. కొన్ని యోగ, తంత్ర సాంప్రదాయములు ఈయన్ను సాక్షాత్తు పరబ్రహ్మముగా భావిస్తాయి. రామాయణ కాలమునకు ముందే ఉన్నట్టి పరశురామునికి కూడా ఈయన గురువన్న సంగతిని బట్టి ఈయన ఎంతటి మహనీయుడో మనం ఊహించవచ్చు.వేదములకు అనుబంధములైన ఉపనిషత్తులలో జ్ఞానము యొక్క ప్రస్తావన మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వీనియందు దాదాపు ఇరవై యోగోపనిషత్తులు మనకు లభిస్తున్నాయి. అట్టివానిలో జాబాల దర్శనోపనిషత్ నందు అష్టాంగయోగమును వైదిక సాంప్రదాయానుసారముగా వివరించినట్లు మనకు గోచరిస్తున్నది. ఈ ఉపనిషత్తునందు దత్తాత్రేయులు తన శిష్యుడగు సాంకృతి యనువానికి అనేకములైన యోగరహస్యములు బోధించినట్లుగా ఉన్నది.పతంజలి మహర్షి ప్రణీతములగు యోగసూత్రములకు ఈ ఉపనిషత్తునందు చెప్పబడిని విధానములకు కొన్ని భేదములున్నవి. యోగసూత్రములు బౌద్ధముచే ప్రభావితమైనట్లు కనిపించగా జాబాల దర్శనోపనిషత్ వైదిక సాంప్రదాయమునకు దగ్గరగా ఉన్నట్లు అగుపిస్తుంది. పంచవటి ప్రచురణలనుంచి ఆరవ పుస్తకంగా జాబాల దర్శనోపనిషత్ ను ప్రచురించుట దత్తాత్రేయుల వారి అనుగ్రహంగా భావిస్తున్నాము. దత్తాత్రేయులవారు త్రిమూర్తి స్వరూపుడని మన నమ్మకము. ఈయన మహాజ్ఞాని మాత్రమేగాక మహాయోగి కూడా ! అవధూత సాంప్రదాయమునకు ఈయన ఆద్యుడు. కొన్ని యోగ, తంత్ర సాంప్రదాయములు ఈయన్ను సాక్షాత్తు పరబ్రహ్మముగా భావిస్తాయి. రామాయణ కాలమునకు ముందే ఉన్నట్టి పరశురామునికి కూడా ఈయన గురువన్న సంగతిని బట్టి ఈయన ఎంతటి మహనీయుడో మనం ఊహించవచ్చు.
వేదములకు అనుబంధములైన ఉపనిషత్తులలో జ్ఞానము యొక్క ప్రస్తావన మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వీనియందు దాదాపు ఇరవై యోగోపనిషత్తులు మనకు లభిస్తున్నాయి. అట్టివానిలో జాబాల దర్శనోపనిషత్ నందు అష్టాంగయోగమును వైదిక సాంప్రదాయానుసారముగా వివరించినట్లు మనకు గోచరిస్తున్నది. ఈ ఉపనిషత్తునందు దత్తాత్రేయులు తన శిష్యుడగు సాంకృతి యనువానికి అనేకములైన యోగరహస్యములు బోధించినట్లుగా ఉన్నది.
పతంజలి మహర్షి ప్రణీతములగు యోగసూత్రములకు ఈ ఉపనిషత్తునందు చెప్పబడిని విధానములకు కొన్ని భేదములున్నవి. యోగసూత్రములు బౌద్ధముచే ప్రభావితమైనట్లు కనిపించగా జాబాల దర్శనోపనిషత్ వైదిక సాంప్రదాయమునకు దగ్గరగా ఉన్నట్లు అగుపిస్తుంది.
పంచవటి ప్రచురణలనుంచి ఆరవ పుస్తకంగా జాబాల దర్శనోపనిషత్ ను ప్రచురించుట దత్తాత్రేయుల వారి అనుగ్రహంగా భావిస్తున్నాము.