సిద్ధసిద్ధాంత పధ్ధతి

మానవజీవితానికి పరిపూర్ణత ఎలా వస్తుంది? దానికి ఏమేం చెయ్యాలి? అనేది మాత్రమే గాక, సృష్టి ఏ విధమైన ప్రణాళికతో జరిగింది అనే విషయాన్ని బ్రహ్మాండం నుండి పిండాండం వరకూ కూలంకషంగా వివరించడం జరిగింది.
Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

Category: Tag:

సిద్ధయోగ సాంప్రదాయానికి పరమగురువైన గోరక్షనాధుడు రచించిన ఈ గ్రంధం వెయ్యి సంవత్సరాల నాటిది. ఇందులో అద్వైతము, గురుతత్త్వము,  తంత్రమార్గము, యోగసాధనా రహస్యములే గాక సిద్ధ యోగ సాంప్రదాయమునకు చెందిన ప్రాచీన భావనలు, దానియొక్క ప్రత్యేకమైన  సాధనా విధానములు వివరించ బడినాయి. సిద్ధుల జీవన్ముక్తికి ప్రతీకగా భావింపబడే ‘అవధూతస్థితి’ వివరంగా చెప్పబడింది. ఈనాడు శక్తిలేని  కుహనాగురువులు కూడా ‘శక్తిపాతం’ ఇస్తున్నామని చెబుతూ  ఎక్కడబడితే అక్కడ మేమంటూ  తయారౌతున్నారు.  సిద్ధమార్గంలో  కలిగే అసలైన శక్తిపాతం ఎలా ఉంటుందో ఈ గ్రంధంలో స్పష్టంగా చెప్పబడింది.

మానవజీవితానికి పరిపూర్ణత ఎలా వస్తుంది? దానికి ఏమేం చెయ్యాలి? అనేది మాత్రమే గాక, సృష్టి ఏ విధమైన ప్రణాళికతో జరిగింది అనే విషయాన్ని బ్రహ్మాండం నుండి పిండాండం వరకూ కూలంకషంగా వివరించడం జరిగింది.