మహాస్మృతి ప్రస్థాన సూత్రము

 100.00

బుద్ధుని ధ్యానమార్గమైన ‘విపశ్యాన ధ్యానము’ నకు ఇది ఒక గైడ్ బుక్ వంటిది. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అర్ధం చేసుకుంటే, బుద్ధుని ధ్యానమార్గం చక్కగా అర్ధమౌతుంది. ఆయన చేసిన సాధన ఏమిటో, ఆయన నడచిన దారి ఏమిటో, దానిలో మనం కూడా ఎలా నడవవచ్చో స్పష్టంగా అర్ధమౌతుంది.

మా ఇతర ప్రచురణల వలెనే, ఈ పుస్తకం కూడా మీ ఆదరణను పొందుతుందని, మీకు ఆధ్యాత్మికంగా గొప్ప మార్గదర్శి అవుతుందన్న విశ్వాసం మాకుంది.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

Availability: 9 in stock

SKU: PSF-2020-01-15-TE-P1 Category: Tags: , , ,

ఈ ప్రపంచంలో ఇప్పటివరకూ ఎందరో మహనీయులు, దివ్యపురుషులు జన్మించారు. వారందరిలో గౌతమబుద్ధునిది ఒక విలక్షణమైన మార్గము. అప్పటివరకూ లేని ఒక నూతన మార్గాన్ని తన తపస్సుతో ఆయన కనుకున్నాడు. ఆ మార్గంలో నడవడమే దుఃఖం అనేది శాశ్వతంగా నశించిపోవడానికి దారియని ఆయన అన్నాడు. ఆ దారి ఏమిటో చాలా స్పష్టంగా బోధించాడాయన. అప్పటినుంచీ ఇప్పటివరకూ దానిలో నడచి ఎందరో ఆయనలాగా బుద్ధత్వాన్ని పొందారు. తమతమ జీవితాలను ధన్యములు చేసుకున్నారు.

దుఃఖము నశించాడానికి అభ్యాసము గావించబడే ధ్యానవిధానమే బుద్ధభగవానుని ధ్యానము. తాను కనుగొనిన ఈ వినూత్న ధ్యానమార్గము పైన బుద్ధభగవానుడు చేసిన ఉపదేశములు అనేకములు త్రిపిటకములలో ఉన్నవి. వీటిలో ‘మహాస్మృతిప్రస్థాన సూత్ర’ మనబడే ఈ ఉపదేశము చాలా ముఖ్యమైనది. ఎందుకనగా, తన ధ్యానమార్గమును గురించిన ఆచరణాత్మకములైన ఉపదేశములను బుద్ధభగవానుడు ఇందులో చేశాడు. త్రిపిటకములలోని దీర్ఘనికాయములో గల ‘మహావర్గము’ అనబడే గ్రంథములో ఈ ఉపదేశములు మనకు లభిస్తున్నాయి.