Regular Table

Showing 41 – 50 of 79 results Showing all 79 results Showing the single result No results found
Sort by Price low to high
Filters Sort results
Reset Apply
Image
Name
Description
Price
Quantity
Add to cart
Sri Rama Gita

‘శ్రీరామగీత’ యనిన పేరును బట్టి ఇది సాక్షాత్తు శ్రీరామునిచేత చెప్పబడిన బోధయని మనకు అర్థమౌతుంది. వ్యాసమహర్షి చేత రచింపబడిన బ్రహ్మాండపురాణంలోని ఆధ్యాత్మరామాయణమనేది ఉమామహేశ్వర సంవాదరూపంలో ఉంటుంది. శ్రీరాముని దివ్యచరిత్రను గురించి పార్వతీదేవి అడుగగా, ఆ చరిత్రలోని ఆధ్యాత్మికములైన అర్థములను, లోతుపాతులను, పరమేశ్వరుడు ఆమెకు వివరించినదే ఆధ్యాత్మరామాయణము. ఇది వేదవేదాంతముల సారమైన బోధగా మనకు గోచరిస్తుంది.

‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి వెలువడుతున్న 55 వ పుస్తకముగా దీనిని అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం నుండి విడుదల చేస్తున్నాము.

Purchase eBook on
Get it on Google Play

 60 75
Max: 14
Min: 1
Step: 1
FC_GKM

భగవద్గీతలో 700 శ్లోకములున్నప్పటికీ ఘంటసాల గారు పాడినవి, వారికి ముఖ్యములనిపించిన 108 శ్లోకములకు 158 కందపద్యములను రచయిత్రి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయిగారు తెలుగులో చక్కగా వ్రాసినారు.

లౌకిక విషయములపైన పద్యములను చెప్పడం సాధారణమైతే, ఉన్నతభావములతో కూడిన ఆధ్యాత్మిక విషయములపైన చెప్పడం సమున్నతం. అందులోను ‘భగవతా నారాయణేన స్వయం’ సాక్షాత్తు భగవంతుడైన నారాయణునిచే చెప్పబడిన గీతాశాస్త్రశ్లోకములను పద్యరూపంలో తెనిగించడం మహోన్నతం.

గీతలోని శ్లోకముల యొక్క భావమును పద్యరూపములోనికి తెచ్చుటలో రచయిత్రి సఫలీకృతురాలైనది. మరందసమములైన ఆయా పద్యములను ఆస్వాదించినపుడు చదువరులు దీనిని గ్రహించగలుగుతారు.

Purchase eBook on
Get it on Google Play

 60
Max: 6
Min: 1
Step: 1
FC_జ్ఞానసంకలినీ-తంత్రము

పేరుకు తగినట్లుగానే, ఇతర జ్ఞానతంత్రముల నుండి సంకలనము చేయబడినట్లుగా ఈ గ్రంథములోని విషయములు కనిపిస్తున్నాయి. సృష్టిక్రమము, పంచతత్త్వములు, షట్చక్రములు, ఓంకారస్వరూపములను ఈ గ్రంథము వివరించుచున్నది. మిథ్యాచారములను నిరసిస్తూ, ఆచారములకు మూలమైన జ్ఞానప్రాప్తిని ధ్యేయముగా ఇది ప్రకటించుచున్నది.

Purchase eBook on
Get it on Google Play

 60
Max: 17
Min: 1
Step: 1
TaraStotram

దక్షిణేశ్వర కాళికాలయంలో వెలసి, శ్రీరామకృష్ణులచే పూజింపబడి, ఆయనకు దర్శనమిచ్చి, మాట్లాడి, ఆయన పెట్టినది తిని, ఆయనతో ఆడుకున్న కాళికామాత, భవతారిణి యనే నామంతో ప్రసిద్ధగన్నది. అంటే, భవబంధములనుండి, కష్టముల నుండి, తరింపజేసే దేవతయని అర్థం. ఆమెకే మరొక పేరు తారాదేవి.

భవతారిణీమాతను ప్రస్తుతిస్తూ 27 సంస్కృత శ్లోకములతో, 260 తెలుగు పద్యములతో సాగిన ఈ రచన 2013 వ సంవత్సరములో ఆశువుగా ఉద్భవించినది. పేరుకు ఇదియొక దేవతాస్తోత్రమే అయినప్పటికీ, దీనిలోని ప్రతి శ్లోకమూ అనేక తంత్ర సాధనా రహస్యములను తనలో నిక్షిప్తం చేసుకొని ఉన్నది. జిజ్ఞాసువులకు, సాధకులకు, తంత్రాభిమానులకు ఈ కృతి ఆనందాన్ని కలిగిస్తుందని మా ఆకాంక్ష.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 70 100
Max: 10
Min: 1
Step: 1

వేదములకు అనుబంధములైన ఉపనిషత్తులలో జ్ఞానము యొక్క ప్రస్తావన మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వీనియందు దాదాపు ఇరవై యోగోపనిషత్తులు మనకు లభిస్తున్నాయి. అట్టివానిలో జాబాల దర్శనోపనిషత్ నందు అష్టాంగయోగమును వైదిక సాంప్రదాయానుసారముగా వివరించినట్లు మనకు గోచరిస్తున్నది. ఈ ఉపనిషత్తునందు దత్తాత్రేయులు తన శిష్యుడగు సాంకృతి యనువానికి అనేకములైన యోగరహస్యములు బోధించినట్లుగా ఉన్నది.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 70 100
Max: 5
Min: 1
Step: 1

The Upanishads, which are the end portions of Vedas are storehouses of Jnana. However, there are few Upanishads which exclusively deal with Yoga. Sri Jabala Darsana Upanishad is one among the twenty Yoga Upanishads available to us. In this Upanishad, Ashtanga Yoga is explained with reference to the Vedic tradition. Lord Dattatreya teaches the secrets of Yoga to his disciple named Sankriti.

Purchase paperback on
Purchase eBook on
Get it on Google Play
 70 100
Max: 10
Min: 1
Step: 1
TN_Shandilyopanishat

శాండిల్యమహర్షి పేరు మీద ఈ ఉపనిషత్తు మనకు దర్శనమిస్తుంది. శాండిల్యగోత్రం మనకు ఉత్తరభారతదేశంలోనూ, గోదావరిజిల్లాల లోనూ కనిపిస్తుంది. ఇది అథర్వణ వేదమునకు చెందిన ఉపనిషత్తు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దానికి చెందినదిగా కొందరు పండితులు నిర్ధారించారు. కొందరేమో క్రీ.శ 3 వ శతాబ్దమన్నారు. పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రముల పైన బుద్ధమతప్రభావం కనిపిస్తుంది. కానీ శాండిల్య యోగసూత్రములలో ఆ ప్రభావం ఉండదు. ఇది పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారిగా గోచరిస్తుంది. యోగమునూ, బ్రహ్మవిద్యనూ అధ్యయనం చెయ్యాలన్న ఇచ్ఛతో శాండిల్య మహర్షి, అథర్వణమహర్షిని ఆశ్రయించి ఆయన వద్ద పొందిన ఉపదేశమే ఈ ఉపనిషత్తు. యోగసాంప్రదాయం పైన ఇది సాధికారిక గ్రంథమని చెప్పవచ్చు.

Purchase paperback on

Purchase eBook on
Get it on Google Play

 70 150
Max: 6
Min: 1
Step: 1
FC_Goraksha Samhita

ఈ పుస్తకం, 'గోరక్షశతకం', 'గోరక్షయోగశాస్త్రమ'న్న రెండు గ్రంథముల సమాహారం. ఈయనకే గోరఖ్ నాధుడని పేరున్నది. ఈయన మత్స్యేంద్రనాధుని శిష్యుడు, మత్స్యేంద్రనాధుడు సాక్షాత్తు పరమశివుని శిష్యుడు. వీరిది శుద్ధమైన కౌలయోగ సిద్ధమార్గం. నాధయోగులందరూ పరమశివభక్తులు. ఎన్నో అమానుషములైన యోగసిద్ధులు కల్గిన తపశ్శక్తిసంపన్నులు. కొన్ని గ్రంధములలో మత్స్యేంద్రనాధుడు తనను తాను ఉమాశంకర పుత్రుడనని చెప్పుకున్నాడు. గోరక్షనాధుడు 10 వ శతాబ్దంలో బెంగాల్, అస్సామ్ ప్రాంతాలలో నివసించినట్లు ఆధారాలున్నాయి.

Purchase eBook on
Get it on Google Play

 70 100
Max: 8
Min: 1
Step: 1
YogaRahasya_FC

మన పురాణములు ఎంతో జ్ఞానసంపదను తమలో కలిగియున్న నిధులు. పురాణములలో చరిత్ర, ప్రాంతీయకథలు, ఆచారములు, వేదాంతము, జ్ఞానము, యోగము, నీతిసూత్రములు, జీవన ధర్మములు, ఇలా ఎన్నెన్నో విషయములు కలగలసి చెప్పబడి ఉంటాయి. వాటిలో మార్కండేయపురాణం ఒకటి. ఇది మార్కండేయమహర్షి చరిత్ర. శివానుగ్రహంతో ఆయన మృత్యువును ఎలా జయించాడన్న గాథ ఇందులో చెప్పబడి ఉంటుంది. అలర్కమహారాజుకు దత్తాత్రేయస్వామి చేసిన జ్ఞానబోధ కూడా దీనిలో ఉన్నది. ఈ బోధ, యోగాభ్యాసము, యోగసిద్ధి, యోగిచర్యలనే మూడు అధ్యాయములలో చెప్పబడింది.

Purchase eBook on
Get it on Google Play

 70 100
Max: 5
Min: 1
Step: 1
Muktikopanishad_FrontCover

ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదమునకు చెందినది. దీనిలో 108 ఉపనిషత్తుల పేర్లు ఇవ్వబడినాయి. వాటియొక్క వేదములు, శాంతిమంత్రముల వివరము కూడా దీనిలో ఇవ్వబడింది. హనుమంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీరామచంద్రుడు ఇచ్చిన సమాధానముల రూపంలో ఈ ఉపనిషత్తు చెప్పబడినది. దీనిలో, బంధము, మోక్షము, సాధనాసంపత్తి, ముముక్షు లక్షణములు, ఆచార్యుని లక్షణములు, జీవన్ముక్తి, విదేహముక్తి, యోగసాధనా విధానము, వివిధములైన సమాధిస్థితులు, జీవన్ముక్తుని జీవనాసరళి, భక్తి, జ్ఞాన, యోగముల సమన్వయము మొదలైన విషయములు వివరముగా చెప్పబడినవి. అన్ని ఉపనిషత్తుల సారము ఈ ఉపనిషత్తులో మనకు గోచరిస్తుంది.

Purchase eBook on
Get it on Google Play

 70 80
Max: 14
Min: 1
Step: 1
1...456...8