ఆదినాథుడైన పరమశివుని నుండి ఉద్భవించినవే నాథ సాంప్రదాయము. దీనియందు నవనాథులు ప్రసిద్ధులు. వీరు వరుసగా మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు మొదలుగా గల తొమ్మిది మంది మహాసిద్ధులుగా ఉన్నారు. వీరి యోగము పతంజలిమహర్షి ప్రణీతమైన అష్టాంగయోగమునకు భిన్నమైన షష్టాంగయోగమని చెప్పబడుతుంది.
సిద్ధయోగసాధనా విధానములను వివరిస్తున్న ఈ అద్భుత గ్రంథమునకు నా వ్యాఖ్యానము యోగాభిమానులకు, సిద్ధయోగ సాధకులకు, సమస్త భారతీయులకు ఆనందమును కలిగిస్తుందని భావిస్తున్నాను.