ఈ పరిశోధనా గ్రంథంలో, పద్దెనిమిది మంది భారతదేశపు మహనీయుల జాతకాలు, వారి జీవితంలోని ముఖ్యసంఘటనలు వివరించబడ్డాయి. వీరిలో అతిప్రాచీనుడైన శ్రీకృష్ణునితో మొదలుపెట్టబడి, మన కాలంలోనే జీవించిన జిల్లెళ్లమూడి అమ్మగారి వరకూ 18 జాతకాలున్నాయి.
వీరి జాతకాలను వ్రాయాలంటే, ముందుగా వీరి ఖచ్చితమైన జననసమయాలు తెలియాలి. అవి లేవు గనుక, ‘రివర్స్ యాస్ట్రో ఇంజనీరింగ్’ చేసి వాటిని రాబట్టడం జరిగింది. అదంతా ఎలా చేసానో ఆయా అధ్యాయాలలో సోదాహరణంగా వివరించాను. జ్యోతిశ్శాస్త్ర విద్యార్థులకు ఈ గ్రంథం ఒక విందుభోజనం అవుతుందని నమ్ముతున్నాను. భారతీయ చరిత్ర అభిమానులకు, జ్యోతిశ్శాస్త్ర అభిమానులకు మరియు విద్యార్థులకు, ఎంతో ఉపయోగకరమైన ఈ రిసెర్చి గ్రంథాన్ని మా సంస్థ యొక్క 68వ పుస్తకంగా విడుదల చేస్తున్నాను.