ఈ గ్రంథమును రచించిన శ్రీ సదానందసరస్వతీస్వామి, 15 వ శతాబ్దంలో జీవించారు. ఈయన శంకర సాంప్రదాయమునకు చెందిన ప్రసిద్ధ వేదాంతాచార్యులలో ఒకరు.
పేరుకు తగినట్లుగా ఈ గ్రంథము అద్వైతవేదాంతసారమే. దీనిలో సాధనాసంపత్తి, మహావాక్యముల ప్రమాణము, మాయ, అవిద్య, జ్ఞానము, వ్యష్టి, సమష్టి, సగుణ నిర్గుణ బ్రహ్మములు, యోగసాధన, సిద్ధి, జీవన్ముక్తి మొదలైన గహనములైన విషయములు సులభమైన రీతిలో వివరించబడినాయి. సరళమైన నా వ్యాఖ్యానము, జ్ఞానసాధకులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.