స్వరశాస్త్రమనే ఈ ప్రాచీనగ్రంథము తంత్రశాస్త్రమునకు చెందినది. తంత్రములన్నియు పరమశివుని చేత దేవికి చెప్పబడినవి. ఈ గ్రంథములో స్వరములు వాటి తత్త్వములు, దశనాడులు, దశవాయువులు, నిత్యజీవితంలో ఈ శాస్త్రము యొక్క ఉపయోగము, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి వివిధ ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దినఫలితములు, వాతావరణ పరిశీలన, పంటలు, స్త్రీ వశీకరణము, సంతానము, రోగములు నిర్ధారణ, మరణసమయము, ఛాయాపురుష సాధన, కుండలినీ యోగము మొదలైన అనేక విషయములు వివరింపబడినవి.
‘పంచవటి’ నుండి వెలువడుచున్న 61వ గ్రంథముగా దీనిని విడుదల చేయుచున్నాము.