హిందూమతమని పిలువబడే సనాతనధర్మములో నాథసాంప్రదాయం ఒకటి. దీనినే సిద్ధసాంప్రదాయమని కూడా పిలుస్తారు. దీనిలో నవనాథులనబడే సిద్ధులు ప్రసిద్ధులు. ఆదినాథుడైన ఈశ్వరునినుండి ఈ సాంప్రదాయం మొదలైనది. ఆయననుండి మత్స్యేంద్రనాథుడనే మహాసిద్ధుడు వచ్చినాడు. ఆ తరువాత ఆయన శిష్యుడైన గోరఖ్ నాథుడు దర్శనమిస్తాడు. ఈయన కూడా తన గురువువలె మహాసిద్ధుడు.
శ్రీగోరక్షనాథులు రచించిన ఈ గ్రంథమునకు చేయబడిన మా వ్యాఖ్యానము యోగసాధకులకు, సిద్ధమార్గమును అభిమానించేవారికి ఆనందమును కలిగిస్తుందని ఆశిస్తున్నాము.