*శ్రీ లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక – రెండవ ముద్రణ*
శ్రీవిద్యోపాసకులకు లలితానామములు నిత్యపారాయణములు. దేవీసహస్రనామములలో లలితానామములు అత్యున్నతములని ప్రసిద్ధి. వీటికి బహుముఖములైన అర్థములున్నాయి. ఇవి పురాణప్రోక్తములైనప్పటికీ, తాంత్రికపరమైన అర్థములను ఎక్కువగా కలిగియున్నాయి. ఎందుకనగా, శక్తి ఉపాసన యనునది ప్రాథమికముగా తాంత్రికమే.
ఈ గ్రంథమున, లలితానామములలో దాగియున్న సాంఖ్య, వేదాంత, యోగ, తంత్ర, జ్యోతిషపరములైన అనుభవ సాధనారహస్యములు వివరించబడినాయి.








