Vijnana Bhairava Tantra – విజ్ఞానభైరవ తంత్రము (Telugu) – Second Edition

Vijnana Bhairava Tantra – విజ్ఞానభైరవ తంత్రము (Telugu) – Second Edition

₹ 120

*విజ్ఞానభైరవ తంత్రము – రెండవ ముద్రణ*

ఇది రుద్రయామలళ తంత్రము నుండి సేకరించబడినది. కాశ్మీరత్రిక సాంప్రదాయులకు ఇది ప్రామాణిక గ్రంథము. ఇది జ్ఞానతంత్రము. బాహ్యపుతంతులకు భిన్నములైన 112 ధారణా విధానములు దీనిలో ఇవ్వబడినవి. భూగోళముపైన ధ్యానులందరూ అనుసరిస్తున్న ధ్యానవిధానములన్ని ఈ గ్రంథములో ఒకేచోట మనకు లభిస్తున్నాయి.

Availability: 100 in stock

SKU: PSF-2026-11-19-TE-P-2 Categories: , , Tags: , , , ,

*విజ్ఞానభైరవ తంత్రము – రెండవ ముద్రణ*

ఇది రుద్రయామలళ తంత్రము నుండి సేకరించబడినది. కాశ్మీరత్రిక సాంప్రదాయులకు ఇది ప్రామాణిక గ్రంథము. ఇది జ్ఞానతంత్రము. బాహ్యపుతంతులకు భిన్నములైన 112 ధారణా విధానములు దీనిలో ఇవ్వబడినవి. భూగోళముపైన ధ్యానులందరూ అనుసరిస్తున్న ధ్యానవిధానములన్ని ఈ గ్రంథములో ఒకేచోట మనకు లభిస్తున్నాయి.

దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున దీని ఉపాసకులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు ముఖ్యముగా, కాశ్మీర వీరశైవమునకు చెందిన త్రికసాంప్రదాయులగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంథము. ఈ ధారణల పైన అనేకులు ఇప్పటికే ఎవరికి తోచినట్లుగా వారు వ్యాఖ్యానించి యున్నారు. నా సాధనానుభవములను బట్టి నాకర్థమైనట్లుగా నేనును ఈ వ్యాఖ్యానమును గావించాను.

ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు. మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. సాధకులకు ఇదొక గైడ్ బుక్ అని చెప్పవచ్చును. అనవసరములైన సిద్ధాంతములు, చర్చల జోలికి పోకుండా, ఆచరణాత్మకమైన ధారణా విధానములను సూటిగా భోదించుట ఈ తంత్రము యొక్క ప్రత్యేకత.

తంత్ర మార్గమునందు నడిచే ఇచ్ఛ ఉన్నవారు, సమర్థుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించునట్టి అనుభవములను పొందగలుగుతారు.

 

Weight 160 g
Dimensions 22 × 14 × 2 cm